ఏపీలో బీజేపీ కాపు మంత్రం!

18
- Advertisement -

ఏపీలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలతో పాటు కాంగ్రెస్ బీజేపీ వంటి జాతీయ పార్టీలు కూడా బలంగా పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీని ఓడించేందుకు టీడీపీ జనసేన కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ రెండు పార్టీలతో బీజేపీ కలుస్తుందని గత కొన్నాళ్లుగా గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పొత్తు విషయంలో అధిష్టానంతో చర్చలు జరిపారు కూడా. కానీ ఇంతవరకు బీజేపీ పెద్దలు మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం. బీజేపీ పొత్తుతో సంబంధం లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

ఇప్పటికే టీడీపీ జనసేన కూటమి తొలి జాబితా అభ్యర్థులను విడుదల చేయగా అందులో బీజేపీకి ఎలాంటి సీట్ల కేటాయింపు జరపలేదు. దీంతో బీజేపీ తో పొత్తు దాదాపు సన్నగిల్లినట్లే అనే అభిప్రాయానికి వచ్చారు చాలమంది. ఇక ప్రస్తుతం బీజేపీ సింగిల్ గా పోటీ చేసే దిశగా అడుగులు వేస్తూ 175 నియోజక వర్గాలకు గాను దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇక సీట్ల కేటాయింపు, పొత్తులపై అంతిమ నిర్ణయం కోసం నేడు రేపు బీజేపీ కోర్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి.

ఈ సమావేశాల తర్వాత అన్నీ విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలల్లో బీసీ అభ్యర్థిని సి‌ఎం చేస్తామని చెబుతూ వచ్చిన కాషాయ అధిష్టానం ఏపీలో కాపు అభ్యర్థిని సి‌ఎం చేస్తామనే నినాధంతో ముందుకు సాగానున్నట్లు సమాచారం. ఏపీలో బలమైన సామాజిక వర్గంగా కాపు సామాజిక వర్గం ఉంది. పైగా కాపు నేతలు సి‌ఎం పదవి చేపట్టిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో కాపు నేతను సి‌ఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఏపీ ఓటర్లనూ ప్రభావితం చేయవచ్చనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఏపీ ఎన్నికల్లో బీజేపీ విధానం ఎలా ఉండబోతుందనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Also Read:ఫిట్‌గా ఉండాలంటే ఇలా చేయండి!

- Advertisement -