BJP:మేమే సి‌ఎం.. అలాగైతేనే పొత్తు?

24
- Advertisement -

ఏపీలో పొత్తుల అంశం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఈ పొత్తు వ్యవహారం మరింత రంజుగా మారుతోంది. ముఖ్యంగా బీజేపీ చుట్టూనే ఈ పొత్తు అంశం చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఎందుకంటే టీడీపీ జనసేన పార్టీలు బీజేపీ దోస్తీ కోరుకుంటూ ఉంటే బీజేపీ మాత్రం ఎలాంటి డెసిషన్ చెప్పకుండా అలాగే కాలం గడిపేస్తోంది. దీంతో పొత్తు ఉన్నట్లా ? లేనట్లా ? అనే దానిపై క్లారిటీ లేక టీడీపీ జనసేన కూటమి తల పట్టుకుంటోంది. ఇక ఇప్పటికే సీట్ల ప్రకటన చేయాల్సి ఉండగా.. పొత్తుపై స్పష్టత లేకపోవడం వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే బీజేపీ ఎందుకు డెసిషన్ చెప్పట్లేదనే దానిపై రకరకాల విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా కమలం పార్టీ పెద్దలు చంద్రబాబును నమ్మడం లేదని కొందరు చెబుతుంటే.. కాదు కాదు బీజేపీ ఆధిపత్యం కోసమే పొత్తును హోల్డ్ లో పెడుతోందని మరికొందరు చెబుతున్నారు. .

ఇదిలా ఉండగా పొత్తు విషయంలో ఏపీ బీజేపీ ఉపాద్యక్షుడు విష్ణు వర్ధన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో మరింత మంట పుట్టిస్తున్నాయి. ఏపీలో బీజేపీ బలహీన పార్టీ అనుకుంటే పొరపాటేనని, తమ పార్టీ బలమైనది కాబట్టే పొత్తుల కోసం ఆరాట పడుతున్నాయని ఆయన కామెంట్స్ చేశారు. అంతే కాకుండా టీడీపీ, జనసేన పార్టీలతో కలవాలంటే సి‌ఎం అభ్యర్థిగా తమ పార్టీ అభ్యర్థే ఉండాలని డిమాండ్ చేశారు. ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే టీడీపీ జనసేన తరుపున ఇప్పటివరకు సి‌ఎం అభ్యర్థి ఎవరనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అటు పవన్, ఇటు చంద్రబాబు సి‌ఎం సీటుపై గట్టిగానే కన్నెశారు. ఇప్పుడు కొత్తగా బీజేపీ కూడా సి‌ఎం సీటు ఆశిస్తుండడంతో ఎంతకీ ఎవరికి సి‌ఎం సీటు అనే కన్ఫ్యూజన్ నెలకొంది. అయితే బీజేపీ సి‌ఎం సీటు ఆశిస్తే టీడీపీ పొత్తుకు వెనకడుగు వేసే అవకాశం ఉందని కొందరి అభిప్రాయం. మరి ఈ ముక్కోణపు కన్ఫ్యూజన్ కు ఎప్పుడు తెర దించుతారో చూడాలి.

Also Read:హ్యాపీ బర్త్ డే…బాపు కేసీఆర్

- Advertisement -