స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. బంద్‌కు ఏపీ సర్కార్ కూడా మద్దతివ్వడంతో బంద్‌లో అంతా స్వచ్చందంగా పాల్గొంటున్నారు. కార్మిక సంఘాల నిరసనతో బస్సులు బస్టాండ్‌కే పరిమితమయ్యాయి.
బీజేపీ మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలు, ప్రజా, కార్మిక సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. బంద్ ప్రభావంతో విశాఖపట్నంలో అర్బన్ సిటీ బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. అధికార వైఎస్సార్‌సీపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం, ఆప్, టీఎన్‌టీయూసీ, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్, ఎస్‌ఎఫ్‌ఐ సంఘాలు సైతం నిరసనలో పాల్గొన్నాయి.
బంద్‌తో అన్ని విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయి. బంద్ నేపథ్యంలో మధ్యాహ్నం ఒంటిగంటి వరకు బస్సులు డిపోలకే పరిమితంకానున్నాయి. మధ్యాహ్నం తర్వాత బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. బంద్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.