30 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

275
ap assembly sessions
- Advertisement -

ఏపీ అసెంబ్లీ సమావేశాల ముహుర్తం ఖరారైంది. ఈ నెల 30 నుండి 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో అసెంబ్లీ పనిదినాలను కుదించగా ఈ సమావేశాల్లో కీలక ఆర్డీనెన్స్‌లను తీసుకురానుంది జగన్ సర్కార్‌.

11 చట్టాల్లో సవరణలు, 3 ఆర్డినెన్స్‌లు తీసుకురానున్నట్లు సమాచారం. అలాగే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ,టీడీపీ మధ్య మాటల యుద్దం నెలకొన్న నేపథ్యంలో సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి.

ఏపీ సీఎస్ నీలం సాహ్ని.. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్​కు లేఖ రాశారు. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తే గ్రామీణ ప్రాంతాలకు కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని సీఎస్‌ లేఖలో పేర్కొన్నారు. అయితే టీడీపీ మాత్రం ఎన్నికలు జరగాల్సిందేనని పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ రమేష్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారోనన్న సందిగ్దం అందరిలో నెలకొంది.

- Advertisement -