రేపటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు….

319
jagan
- Advertisement -

రేపటి(జూన్ 16) నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సెషన్స్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టాలని జగన్ సర్కార్ యోచిస్తోండగా రేపు ఉదయం 10 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు గవర్నర్.కరోనా వైరస్ నేపథ్యంలో వీడియో ప్రసంగం ద్వారా గవర్నర్ మాట్లాడనున్నారు. ఇక 60 ఏళ్ల పైబడిన సభ్యులు సభకు హాజరుకావాలా వద్దా అన్నది వారికే వదిలేస్తున్నట్లు తెలిపారు స్పీకర్ తమ్మినేని.

ఇక కరోనా వైరస్ ఉదృతి రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వైద్య ఆరోగ్య శాఖ పలు జాగ్రత్తలను సూచించింది. అసెంబ్లీ, మండలి సభ్యులందరూ తప్పనిసరిగా అన్ని సమయాల్లో మాస్క్‌లు ధరించాలి.. సభలోకి వెళ్లే ముందు శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకోవాలని తెలిపింది.

స్క్రీనింగ్ టెస్టు అనంతరమే సభ్యులను సభలోకి అనుమతించనున్నారు. సభలో సభ్యులు రెండు మీటర్ల భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పీఎస్‌లు, పీఏలు, పీఎస్‌వోలను తీసుకురాకూడదని పేర్కొన్న వైద్య ఆరోగ్యశాఖ సందర్శకులను అనుమతించేది లేదని తెలిపింది.

- Advertisement -