ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా..

92
- Advertisement -

ఈరోజుతో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఈ నెల 7న సభా సమావేశాలు ప్రారంభం కావడం తెలిసిందే. కాగా, ఏపీ వార్షిక బడ్జెట్ 2022-23కి రాష్ట్ర అసెంబ్లీ శుక్రవారం ఆమోదం తెలిపింది. అనంతరం, అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

జనరంజక బడ్జెట్ తీసుకువచ్చారంటూ స్పీకర్ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. సభ్యులు వివిధ ప్రజాసమస్యలు ప్రస్తావించారని, ప్రభుత్వం బాధ్యతగా వాటన్నింటికీ సమాధానం చెప్పిందని వివరించారు. ప్రజల కోసం తీసుకువచ్చిన అద్భుతమైన చట్టాలకు సమావేశాల్లో ఆమోదం లభించిందని, చట్టాలను ఆమోదించడంలో భాగమైనందుకు సంతోషంగా ఉందని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. అటు, ఏపీ శాసనమండలి కూడా నిరవధికంగా వాయిదా పడింది.

- Advertisement -