- Advertisement -
ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి.రాష్ట్రంలో కరోనా విజృంభణ విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఆ పరీక్షల తేదీలను కరోనా తగ్గుముఖం పట్టాక ప్రకటిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు పదో తరగతి పరీక్షలను కూడా వాయిదా వేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… జూన్ 7 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని ఇన్ని రోజులూ ప్రభుత్వం చెబుతూ వచ్చినప్పటికీ కరోనా పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో వాయిదా వేసింది. పదో తరగతి పరీక్షలపై జులైలో మళ్లీ సమీక్షించి నిర్ణయం తీసుకోనుంది. అలాగే, ఇంటర్ పరీక్షలపై కూడా ఆ నెలలోనే ప్రకటన చేసే అవకాశం ఉంది.
- Advertisement -