ఆ పాత్రలకు కూడా కృతి శెట్టి ఓకే

24
- Advertisement -

ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కృతి శెట్టి యువ హీరోలకి మంచి జోడీగా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే, చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల ఛాన్స్ లు అందుకోవడంలో మాత్రం కృతి శెట్టి వెనకబడింది. అందివచ్చిన అవకాశాలను చేస్తూ వచ్చిన అమ్మడు కెరీర్ లో వేగం కొనసాగించలేకపోయింది. తనతో నటించిన ఒక హీరోతో ప్రేమలో పడిందన్న వార్త కూడా కృతి శెట్టి కెరీర్ మీద ఎఫెక్ట్ పడేలా చేసింది. తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా పర్వాలేదు అనిపించుకున్న కృతి శెట్టి ఈమధ్య ఎందుకో అవకాశాలు లేక ఖాళీగా ఉంది.

వచ్చిన అరకొర అవకాశాలను చేస్తూ వస్తున్నా.. అవి కృతి శెట్టి కెరీర్ కు ఏమాత్రం ఉపయోగపడట్లేదు. ఒకప్పుడు హీరోయిన్ గా చేసిన అమ్మడు ఇప్పుడు ఎలాంటి పాత్ర అయినా ఓకే అనేస్తుంది. చిన్న చిన్న పాత్రలు కెరీర్ కు ఏమాత్రం ఉపయోగం లేకపోయినా ఏదో సినిమాలు చేస్తున్నాం అంటే చేస్తున్నాం అన్నట్టుగా కృతి శెట్టి సినిమాలు చేసే పరిస్థితికి వచ్చేసింది. లేటెస్ట్ గా కృతి శెట్టి మరో సర్ ప్రైజింగ్ రోల్ కి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. కోలీవుడ్ హీరో ఆర్య హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలో కృతి శెట్టి నటిస్తుంది. ఈ సినిమాలో విలన్ గా అర్జున్ నటిస్తుండగా అతని కూతురు పాత్రలో కృతి శెట్టి నటిస్తుందని తెలుస్తుంది.

ఫైనల్ గా హీరో పక్కన హీరోయిన్ గా కాదు, విలన్ కూతురి పాత్ర చేస్తుంది కృతి శెట్టి. కెరీర్ స్వింగ్ లో ఉన్నప్పుడే చేస్తున్న సినిమాలు ఎంచుకుంటున్న కథల మీద పూర్తి ఫోకస్ ఉంచాలి, లేదంటే కెరీర్ రిస్క్ లో పడుతుంది. కృతి శెట్టి కూడా అప్పటికప్పుడు సినిమాలు వస్తున్నాయి చేస్తున్నా అన్నట్టు ఆలోచించుకుంది ముందుచూపుతో ఆలోచిస్తే కాస్త జాగ్రత్త వహించేది. ఏది ఏమైనా ఇచ్చిన చిన్న పాత్రతో అయినా మెప్పించాలని చూస్తుంది కృతి శెట్టి. సినిమాలు కాకపోతే వెబ్ సీరీస్ లు ఇలా ఏదో ఒక విధంగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలని చూస్తుంది. మళ్లీ కృతి శెట్టి ఫామ్ లోకి వస్తోందో లేదో చూడాలి.

Also Read:చిరంజీవితో మామూలుగా ఉండదు అట

- Advertisement -