మా ‘అన్వేషి’ బ్లాక్ బస్టర్‌

35
- Advertisement -

విజయ్‌ ధరణ్, సిమ్రాన్‌ గుప్తా, అనన్యా నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటించిన హారర్‌ అండ్‌ కామెడీ ఫిల్మ్‌ ‘అన్వేషి’. అరుణ శ్రీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై వి.జె.ఖ‌న్నా ద‌ర్శ‌క‌త్వంలో టి.గ‌ణ‌ప‌తి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. న‌వంబ‌ర్ 17న రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ సెల‌బ్రేష‌న్స్‌లో చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా…

అశోక్ కుమార్ మాట్లాడుతూ ‘‘అన్వేషి’ చిత్రాన్ని మేం ఊహించిన విధంగా పెద్ద స‌క్సెస్ చేసిన ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు. మా డైరెక్ట‌ర్ వి.జె.ఖ‌న్నాగారు ఇన్ని రోజులు ప‌డ్డ క‌ష్టానికి మంచి విజ‌యం ద‌క్కింది. అలాగే నిర్మాత‌గారు కూడా స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నారు. హీరో విజ‌య్‌కి, హీరోయిన్ సిమ్రాన్ గుప్తాకి మంచి పేరు వ‌చ్చింది. నాగిగారి కామెడీని ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేస్తున్నారు. మీ ద‌గ్గ‌రున్న థియేట‌ర్స్‌లో ‘అన్వేషి’ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

కో ప్రొడ్యూస‌ర్ కిర‌ణ్ మాట్లాడుతూ ‘‘‘అన్వేషి’ సినిమాను ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. ఈవారం దాదాపు అన్ని థ్రిల్ల‌ర్ జోన‌ర్ సినిమాలే రిలీజ్ అయ్యాయి. అయితే మా సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది. థియేట‌ర్స్ సంఖ్య‌ను కూడా పెంచే ఆలోచ‌న‌లో ఉన్నాం’’ అన్నారు.దుర్గేష్ మాట్లాడుతూ ‘‘మాకు ఇంత పెద్ద స‌క్సెస్ ఇచ్చిన ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు. ఇదే స‌క్సెస్‌ను కొన‌సాగించాల‌ని అనుకుంటున్నాం. ఎంటైర్ యూనిట్ చాలా ఎంజాయ్ చేస్తోంది’’ అన్నారు.

యాక్ట‌ర్ నాగి మాట్లాడుతూ ‘‘మా ‘అన్వేషి’ సినిమా విజయంలో భాగమైన అందరికీ థాంక్స్. మా డైరెక్టర్ వి.జె.ఖన్నా సినిమా కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. మా హీరో విజ‌య్ లేక‌పోతే ఈ సినిమా లేదు. అలాగే మా గ‌ణ‌ప‌తి రెడ్డిగారు ఖ‌ర్చు విష‌యంలో వెనుకాడ‌కుండా సినిమాను రూపొందించారు. ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌ అన్నారు.

Also Read:Bigg Boss 7:కోట బొమ్మాలితో బిస్ బాస్

- Advertisement -