అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి లాంటి సినిమాల్లో నటించిన అనుష్క త్వరలో భాగమతి సినిమాలో లీడ్ రోల్లో నటించనుంది. చిత్రం షూటింగ్ ఎప్పుడో పూర్తికాగా గత కొన్నాళ్లుగా గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. దాదాపు రూ. 35 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఎప్పుడుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదరుచూసిన ప్రేక్షకులకు చిత్రయూనిట్ గుడ్ న్యూస్ అందించింది. గ్రాఫిక్స్ వర్క్‌ను వచ్చే నెలాఖరు కల్లా పూర్తి చేసి డిసెంబర్ లో చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
అయితే కేవలం టైటిల్ మాత్రమే ఎనౌన్స్ చేసిన ఈ సినిమా హైదరాబాద్ నిర్మాణానికి కారణమైన చారిత్రక పాత్ర భాగమతి జీవిత కథ అన్న ప్రచారం జరిగింది. ఇప్పటికే జానపద, చారిత్రక పాత్రల్లో నటించిన అనుష్క లీడ్ రోల్లో నటిస్తుండటంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. కానీ ఇప్పుడు చిత్ర దర్శకుడు అశోక్ ప్రకటనతో ఇండస్ట్రీ వర్గాలు షాక్ అయ్యాయి.
భాగమతి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా చారిత్రక కథాంశం కాదంటూ ప్రకటించాడు అశోక్. పిల్ల జమీందార్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అశోక్ తొలి సినిమాతోనే మంచి విజయం సాధించాడు. ఆ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకొని ప్రస్తుతం భాగమతి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా థ్రిల్లర్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలిపాడు.
భాగమతి సినిమా ప్రారంభం తర్వాత యువి క్రియేషన్స్ మహానుభావుడు, సాహో వంటి సినిమాలను చేసింది. మహానుభావుడు విడుదలై, మంచి విజయం నమోదు చేసింది. ప్రభాస్ తో నిర్మిస్తున్న సాహో త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.