ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విరాట్ కోహ్లీ.. అనుష్కశర్మల పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. గడిచిన కొద్దిరోజులుగా మీడియా అంతా విరుష్క్ పెళ్లి వార్తలతో నిండిపోయింది. వీరిద్దరికి ఎంతో మంది అభినందనలు చెప్పారు. కొందరైతే సలహాలు.. సూచనలు చేశారు. అయితే ఎవరైనా కొత్త జంటను అభినందిస్తారు.. సంతోషంగా ఉండండని దీవిస్తారు! కానీ టీమ్‌ఇండియా తాత్కాలిక సారథి రోహిత్ శర్మ మాత్రం అందరి కంటే భిన్నమైన సలహా ఇచ్చాడు. విరాట్‌ను పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఇంటి పేరును మార్చుకోవాల్సిన పనిలేదని కొత్త పెళ్లికూతురు అనుష్కకు సూచించాడు.
అంతేకాకుండా విరాట్‌కు సాయం చేసేందుకూ ముందుకొచ్చాడు. ‘‘పెళ్లి చేసుకున్న మీ ఇద్దరికీ అభినందనలు. కోహ్లి.. భార్యతో ఎలా మెలగాలో తెలియజేసే పుస్తకాన్ని నీకిస్తాను. అనుష్కా.. నువ్వు ఇంటి పేరును మార్చుకోవద్దు’’ అని ట్వీట్ చేశాడు రోహిత్. అతడు ఇచ్చిన సలహాకు గురువారం కృతజ్ఞతలు చెప్పింది అనుష్క. రెండో వన్డేలో డబుల్ సెంచరీ ఆడిన రోహిత్‌ను అభినందించింది కూడా. గత కొన్ని రోజులుగా పెళ్లి పనుల్లో తీరిక లేకుండా ఉన్న అనుష్క.. తనకు అభినందనలు తెలిపిన ప్రముఖులందరికీ ట్విటర్లో ధన్యవాదాలు తెలియజేసింది.
ఈ ముచ్చట ఇలా ఉంటే.. తమ పెళ్లి వేడుకను పురస్కరించుకొని ఈ నెల 21.. 26 తేదీల్లో బంధువులకు.. స్నేహితులకు వేర్వేరుగా.. వేర్వేరు వేదికల మీద విందు ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ విందు ఆహ్వానాలను భిన్నమైన రీతిలో తయారు చేసి అందరి మదిని దోచుకుంటున్నారు. ఆహ్వానపత్రికలో పర్యావరణంపై తమకున్న ప్రేమను ప్రదర్శించారు. విందుకు ఆహ్వానించిన వారందరికి ఇన్విటేషన్ తో పాటు.. చిన్న మొక్కను ఇచ్చి సమ్ థింగ్ స్పెషల్ అన్నట్లు వ్యవహరించారు.