టాలీవుడ్లో ప్రభాస్, అనుష్క జంట చూడముచ్చటగా ఉంటుంది. వీళ్లిద్దరూ కలిసి చేసిన సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. మిర్చి, బాహుబలి వంటి చిత్రాలతో టాలీవుడ్లో ఫర్ఫెక్ట్ జంటగా పేరు తెచ్చుకున్నారు. సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగాను వీళ్లిద్దరూ మంచి స్నేహితులు. అయితే బాహుబలి సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఒక్క ఫైట్ సీన్‌కి రూ.90 కోట్లు ఖర్చు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మరోవైపు హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అద్భుతమైన పోరాట సన్నివేశాలు ఉంటాయని, మరింత రియాల్టీ కోసం ప్రభాస్ కూడా డూప్ లేకుండా షూటింగ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే షూటింగ్లో ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, ప్రభాస్‌కి ఇప్పటికే రెండు సార్లు గాయాలు అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న స్వీటీ దుబాయ్‌లోని సాహో సెట్‌కి వెళ్లి ప్రభాస్‌కి గంటసేపు క్లాస్ తీసుకుందట. డూప్ లేకుండా రిస్కీ సన్నివేశాలు చేయకూడదని, నీకేమైనా అయితే ఫ్యాన్స్ బాధపడతారని ప్రభాస్‌కి గట్టి వార్నింగ్ ఇచ్చిందట. దానికి ప్రభాస్ కూడా డూప్‌ను పెట్టుకుంటానని స్వీటీకి ప్రామిస్ కూడా చేశాడని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే బెస్ట్ ఫ్రెండ్ కోసం దుబాయ్ వెళ్లిన స్వీటీని సినీ జనాలు మెచ్చకుంటున్నారు. మిర్చి సినిమా టైమ్ లో వీళ్లిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు కూడా వినిపించాయి. ఈ వార్తలను ప్రభాస్, అనుష్క ఇద్దరూ ఖండించారు. మేం ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమే అంటూ చెప్పిన సంగతి తెలిసిందే.