అనుష్క శెట్టి…’ఘాటి’

5
- Advertisement -

క్వీన్ అనుష్క శెట్టి, క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో ఎక్సయిటింగ్ న్యూ ప్రాజెక్ట్ ‘ఘాటి’ కోసం మరోసారి కొలాబరేట్ అయ్యారు. UV క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించిన ఈ చిత్రం, బ్లాక్ బస్టర్ ‘వేదం’ తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న సెకండ్ మూవీ. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై అనుష్కకు ఇది నాలుగో సినిమా.

ఈ రోజు అనుష్క పుట్టినరోజును సెలబ్రేట్ చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివిల్ చేశారు. ఫస్ట్ లుక్ అనుష్క పాత్ర యొక్క స్టన్నింగ్ అండ్ రూత్ లెస్ అవతార్‌ను ప్రజెంట్ చేసింది. పోస్టర్‌లో, అనుష్క తల, చేతుల నుండి రక్తం కారుతున్నట్లు కనిపిస్తుంది, ఆమె నుదిటిపై బిందీతో, బంగా స్మోక్ చేస్తూ కనిపించడం స్టన్నింగ్ గా వుంది. కన్నీటి కళ్ళు, నోస్ రింగ్స్, ఆమె పాత్ర ఇంటెన్స్ ని తెలియజేస్తూ, పాత్రపై క్యురియాసిటీని క్రియేట్ చేశాయి.

ఇమేజ్ లోని ప్రతి ఎలిమెంట్ కథానాయిక జీవితంలోని కఠినమైన కోణాలను లోతుగా అన్వేషించే ఇంటెన్స్ ఫిల్మ్ ని సూచిస్తున్నాయి. బ్లడ్ షేడ్స్, ఇంటెన్స్ ఎక్స్ ప్రెషన్, మనుగడ, పోరాటాన్ని అద్భుతంగా చూపిస్తున్నాయి. పోస్టర్ ఎమోషనలీ చార్జ్డ్, ఇంటెన్స్ జర్నీకి టోన్‌ని సెట్ చేస్తుంది.

విక్టిమ్, క్రిమినల్, లెజెండ్ అనే ట్యాగ్‌లైన్‌తో, ఘాటీ విలక్షణమైన కథనం; మానవత్వం, మనుగడ, విముక్తి అన్వేషణగా వుంటుంది. క్రిష్ డైరెక్షన్, ఇంటెన్స్ విజువల్ సెట్టింగ్ ప్రేక్షకులకు గ్రిప్పింగ్, విసెరల్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. ఇది కేవలం ఒప్పు, తప్పు గురించి మాత్రమే కాదు, నిజమైన లెజెండ్స్ పుట్టే గ్రే ఏరియాల స్టొరీ.

ఘాటీ గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్‌గా వుంటుంది, క్రిష్, అనుష్కను హై-ఆక్టేన్, యాక్షన్-ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్‌లో ప్రెజంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం 4:05 గంటలకు గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నారు.

రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్న ఘాటి సినిమాలో టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తున్నారు. మనోజ్ రెడ్డి కాటసాని సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ కాగా, చాణక్య రెడ్డి తూరుపు ఎడిటర్. చింతకింది శ్రీనివాసరావు కథ అందించగా, సాయిమాధవ్ బుర్రా మాటలు రాశారు.

హై బడ్జెట్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఘాటీ’ ప్రస్తుతం ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Also Read:BRS:రేవంత్..మోకాళ్ల యాత్ర చేయాలి

- Advertisement -