అనుష్క ఆ విషయం అడగొద్దంటుంది..

219
- Advertisement -

బాలీవుడ్‌లో కథానాయికగా అనుష్క శర్మకి ఫుల్‌ క్రేజ్ ఉంది. తన అందాలతో కుర్రకారుకు మంతెక్కిస్తుంది. ఈ అమ్మడు ఒక వైపున అగ్ర హీరోల జోడీ కడుతూనే , మరో వైపున సొంత బ్యానర్లోను నటిస్తోంది. అనుష్క ‘క్లీన్ స్లేట్’ బ్యానర్ ను స్థాపించిన ఆమె ఆ బ్యానర్ పై ప్రస్తుతం ‘పరి’ అనే హారర్ థ్రిల్లర్ ను నిర్మిస్తోంది. అయితే తాజాగా ఈ మూవీలోని కొత్త స్టిల్ రిలీజ‌యింది. ఆమె వదిలిన స్టిల్ అందరిలో ఆసక్తిని రేకెత్తించేదిలా వుంది. ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా గురించి చెప్పమంటే అది మాత్రం అడగొద్దంటూ ఆమె సస్పెన్స్ లో పెట్టేస్తోంది. ఈ సినిమాలో ఆమె దెయ్యం ఆవహించిన పాత్రలో కనిపించనుందని కొంతమంది అంటుంటే. మానసిక వికలాంగురాలిగా కనిపించనుందని మరికొంతమంది చెప్పుకుంటున్నారు.

Anushka Sharma's New Pari Still Released

అయితే ఈ కొత్త స్టిల్ ను అనుష్కే త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా షేర్ చేసిందట. అంతే కాదు పరి మూవీ రిలీజ్ డేట్ ను కూడా త‌నే అనౌన్స్ చేసింది. అనుష్క అభిమానుల‌కు ఇది కొంచెం డిసప్పాయింట్ న్యూస్ అయినా.. త‌న కొత్త లుక్ తో మాత్రం అభిమానులు అదుర్స్ అనేలా క‌నిపించింది. వ‌చ్చే సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రి 9 న పరి మూవీ రిలీజ్ అవ‌నుంద‌ట‌. ‘పరి’ మూవీ ఫ‌స్ట్ పోస్ట‌ర్ ను కూడా అనుష్కే త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా షేర్ చేసిన విష‌యం తెలిసిందే.

Anushka Sharma's New Pari Still Released

ఈ మూవీ లో అనుష్క నటించ‌డ‌మే కాదు.. ఈ మూవీ ప్రొడ్యూస‌ర్ కూడా త‌నే. ఇంత‌కు ముందు ఎన్ హెచ్ 10, ఫిల్లౌరి మూవీ ల‌కు ప్రొడ్యూస‌ర్ గా ఉంది అనుష్క‌. ఇక అనుష్క‌ షారుక్‌తో న‌టిస్తున్న జ‌బ్ హారీ మెట్ సెజ‌ల్ మూవీ ఆగ‌స్ట్ 4న విడుదలకు సిద్దంగా ఉంది. షారుఖ్ మరుగుజ్జు గా న‌టిస్తున్న మ‌రో మూవీలోనూ న‌టించనుంది అనుష్క‌. ఆ మూవీలో కత్రినా కూడా ఓ రోల్ లో న‌టిస్తుందట. ఇంక సంజ‌య్ ద‌త్ బ‌యోపిక్ లోనూ ఓ చిన్న పాత్ర చేస్తుందట అనుష్క‌. అయితే ‘పరి’ సినిమా అనుష్క శర్మ కెరియర్‌లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందేమో చూడాలి మరి.

- Advertisement -