- Advertisement -
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లీ భార్య నటి అనుష్క శర్మ ..కింగ్ సెంచరీపై ఆనందం వ్యక్తం చేశారు.
ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఫొటో షేర్ చేశారు. ఇండో- పాక్ మ్యాచ్‌ను ఇంటి నుంచే చూసిన అనుష్క, టీవీలో విరాట్ సెంచరీ సంబరాలను ఫొటో తీసి షేర్ చేశారు. దానికి ‘లవ్’, ‘హైఫై’ ఎమోజీలను జత చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక సెంచరీ చేసిన తర్వాత కోహ్లీ తన మెడలోని గొలుసుకున్న వెడ్డింగ్ రింగ్‌ను ముద్దాడారు. అనుష్కకు సందేశమిచ్చేలా కెమెరాకు విజయసంకేతం చూపించారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read:కోహ్లీ..రికార్డుల రారాజు!
- Advertisement -