క్రికెటర్ల బస్సులో విరుష్క జంట.. వీడియో వైరల్

221
Virat-anuska
- Advertisement -

కోహ్లీ సేన ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో వారి సొంత గడ్డపై గెలిచి, కొత్త రికార్డు సృష్టించింది. దీంతో భారత్ 1-0 తేడాతో సిరీస్ లో ముందంజలో ఉంది. ఇక రెండవ టీ20 కార్డీఫ్ లో జరగనుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ బృందం కార్డీఫ్ కి చేరుకుంది. అయితే వీరితో పాటు కెప్టెన్ విరాట్ భార్య, అనుష్క కూడా వారితో బస్సులో ప్రయాణం చేసింది.

భర్త కోహ్లీ పక్కన కూర్చోని అదే బస్సులో కార్డీఫ్ కు చేరుకుంది. అయితే మొదటి మ్యాచ్ జరిగిన సమయంలో అనుష్క గ్యాలరీలో గానీ, హోటల్ లో గానీ కనిపించలేదు. రెండవ మ్యాచ్ సందర్భంగా వీక్షించేందుకు వెళ్లిన అనుష్క భర్తతో కలిసి హోటల్  కు చేరుకుంది. అక్కడే ఉన్న అభిమానులతో కలిసి పోటోలు కూడా దిగింది. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

https://www.instagram.com/p/Bk0t2SFHUD5/?taken-by=virushka_folyf

https://www.instagram.com/p/Bk0y4obnYvL/?taken-by=virushka_folyf

https://www.instagram.com/p/Bk0uGRjn_m5/?taken-by=virushka_folyf

https://www.instagram.com/p/BkzsIFYHMd-/?taken-by=virushka_folyf

- Advertisement -