న్యూ లుక్ తో షాకిచ్చిన అనుష్క..!

243
Anushka Sharma S New Look,
- Advertisement -

నీలి కళ్లతో భయంకరంగా కనిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా? డీ గ్లామ‌ర‌స్ పిక్ తో కనిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరోకాదు..విరాట్ కోహ్లి ప్రేయ‌సి, బాలీవుడ్ భామ అనుష్క శ‌ర్మ . ఒక్కసారిగా ఈ లుక్ తో ఎంట్రీ ఇస్తూ ఫ్యాన్స్‌ ని షాక్ కి గురి చేస్తోంది అనుష్క.

Anushka Sharma, Is That Really You?

  అసలు అనుష్క శర్మ ఇలా కనిపించడానికి కారణం ‘పరి’ చిత్రం. ఈ అమ్మడు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘పరి’ చిత్రం కోసం ఈ గెటప్‌ వేసింది.  మంగళవారం ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభమైంది.  ఈ సందర్భంగా అనుష్క ఫస్ట్‌లుక్‌ను ట్విటర్‌ ద్వారా విడుదల చేసింది. ఎప్పుడూ గ్లామరస్‌గా తెరపై ఆకట్టుకున్న అనుష్క ఉన్నట్టుండి ఇలాంటి గెటప్‌ వేయడంతో ఈ సినిమాపై  ఇప్పటినుంచే బాలీవుడ్‌లో అంచనాలు పెరిగిపోయాయి.

 Anushka Sharma, Is That Really You?

అనుష్క ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఆమె దెయ్యం పాత్రలో నటించిన ‘ఫిల్లోరి’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే అందులో పంజాబి డ్రెస్‌ వేసుకుని సాధారణ  అమ్మాయిలానే ఆకట్టుకుందే కానీ ఇలాంటి గెటప్‌ వేయడం ఇదే తొలిసారి.

పోస్టర్‌లో ‘పరి’ చిత్రీకరణ మొదలైంది అని రాసున్న స్టైల్‌ చూస్తే ఇది దెయ్యం సినిమాలా తెరకెక్కిస్తున్నట్లు  తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రోసిత్‌ రాయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బెంగాలీ నటుడు పరంబ్రతా చటర్జీ కీలక పాత్రలో నటిస్తున్నారు. అనుష్క ఈ సినిమాతో పాటు షారుక్‌కి జోడీగా మరో రెండు  సినిమాల్లో నటిస్తోంది. మ‌రి ఈ సినిమా అనుష్క కి ఎంత‌టి పేరు తీసుకొస్తుందో చూడాలి.

Anushka Sharma, Is That Really You?

- Advertisement -