మరోసారి లేడి ఓరియెంటెడ్ కథతో అనుష్క..!

245
anushka
- Advertisement -

అరుంధతి,భాగమతి వంటి సినిమాలతో లేడి ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్‌గా మారింది అనుష్క. ప్రస్తుతం నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకురానున్న అనుష్క తాజాగా మరో లేడి ఓరియెంటెడ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ ప్రాజెక్టుకు అనుష్క ఓకే చెప్పింది. గతంలో అనుష్క హీరోయిన్‌గా యువీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిన భాగమతి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ నేపథ్యంలో మరోసారి అనుష్కతో మూవీ చేసేందుకు ముందుకొచ్చారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

- Advertisement -