బాహుబలి కలెక్షన్ల సునామీ కొనసాగుతునే ఉంది. ఇప్పటికే భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో రికార్డులను తిరగరాసిన ఈ విజువల్ వండర్, ఓవర్ సిస్‌లోనూ అదే జోరు కంటిన్యూ చేస్తోంది. బాలీవుడ్ టాప్ స్టార్స్‌కు చెమటలు పట్టిస్తూ తిరుగులేని రికార్డులను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడిన అనుష్క…తనకు ప్రభాస్ అంటే చాలా ఇష్టమని తెలిపారు.
అంతేగాదు ప్రభాస్ తో నటించే అవకాశం వచ్చినప్పుడల్లా నటిస్తూనే ఉంటా అంటూ అనుష్క మనసులో మాట బయటపెట్టింది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 2 సినిమాలున్నాయి. ఈ రెండు సినిమాలకూ ఇంకా హీరోయిన్లను ఫిక్స్ చేయలేదు. వీటిలో ఒక సినిమాలో మరోసారి బొమ్మాళిని రిపీట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే, బాహుబలి-2 సినిమా ఇంపాక్ట్ అలాంటిది మరి.
ప్రభాస్-అనుష్క కాంబినేషన్ లో గతంలో కూడా సినిమాలొచ్చాయి. మిర్చితో సెగలు పుట్టించిన ఈ జోడి బాహుబలి-2తో నేషనల్ లెవెల్లో హాట్ జోడీగా మారిపోయారు.
ఇక సోషల్ మీడియాలో ప్రభాస్-అనుష్క జోడిపై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రభాస్ – అనుష్క ఇద్దరూ చిత్రంలో ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’లా వున్నారనీ, చూడచక్కని జంటగా కనిపించారని కితాబిస్తూనే వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటే చాలా బావుంటుందని సలహాలు కూడా ఇచ్చేస్తున్నారు. సహజంగా కొంతమంది హీరోహీరోయిన్లు మాత్రమే ఇలా జతగా అమరుతుంటారు. అలాంటివారిలో ప్రభాస్-అనుష్కలు కూడా. అందువల్లనే కొందరు ప్రభాస్-అనుష్క మ్యారేజ్ అంటూ తమ అభిప్రాయాలను చెప్పేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనుష్క చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.