అతడంటే పిచ్చి, ప్రేమించా….

267
anushka
- Advertisement -

పదకొండేళ్ల కిందట సూపర్ చిత్రంతో వెండితెరకు పరిచయమైన కన్నడ కస్తూరి అనుష్క ప్రస్తుతం దక్షిణాదిలో అగ్రకథానాయికగా చెలామణి అవుతోంది. అరుంధతి సినిమాతో స్టార్‌డమ్ సంపాదించుకున్న అనుష్క బాహుబలి చిత్రాలతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అయితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో ప్రేమలో ఉన్నారనే రూమర్లు కూడా వినిపించాయి. వీరిద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. ఇప్పుడు తాజాగా అనుష్కపై వస్తున్న మరో వార్త హాట్ టాపిక్ గా మారింది.

Anushka-Shetty-

అదేంటంటే స్వీటి ఒక క్రికెటర్ తో ప్రేమలో మునిగితేలుతోందని. అనుష్కకు   ఓ క్రికెటర్ అంటే పిచ్చి. హీరోయిన్ అయిన తర్వాత కూడా తనకు ఊహతెలిసన వయసు నుండే ఆ క్రికెటర్ ను ప్రేమించిందట అనుష్క. మరి అనుష్క మనసును దోచేసిన ఆ క్రికెటర్ ఎవరనుకుంటున్నారా? మిస్టర్ దిఫెండబుల్, ది గ్రేట్ వాల్ రాహుల్ ద్రావిడ్. అనుష్కకి రాహుల్ ద్రావిడ్ అంటే విపరీతమైన క్రష్ అట. ఈ విషయాన్ని స్వయంగా స్వీటీ అనుష్కనే చెప్పింది.  ఓ వెబ్‌ పోర్టల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది అనుష్క.ఈ సందర్భంగా ఓ అభిమాని.. మీ అభిమాన క్రికెటర్‌ ఎవరు అని ప్రశ్నించాడు. సచిన్ విరాట్ అనే సమాధానం వస్తుందని అనుకున్నారంతా . కానీ అనుష్క నుండి ఓ సర్ ప్రైజ్ పేరు వచ్చింది. ‘రాహుల్‌ ద్రవిడ్‌ నా అభిమాన క్రికెటర్‌ అని రిప్లయ్ ఇచ్చింది అనుష్క.

Anushka-Shetty-

”నా చిన్నతనం నుంచి అతనంటే నాకు పిచ్చి. నా ఫస్ట్ క్రస్. ఎంతలా అంటే ఒకానొక సమయంలో ద్రవిడ్‌తో పీకల్లోతు ప్రేమలో పడిపోయా’ అని ముసిముసి నవ్వులు నవ్వేసింది అనుష్క.  ప్రస్తుతం భాగమతి చిత్రంలో నటిస్తోంది. కథానాయిక ప్రాధాన్యమున్న పాత్రలకు అనుష్క పేరు ముందు వరుసలో ఉంటుంది. చిత్ర పరిశ్రమకు, క్రికెట్‌కు విడదీయరాని అనుబంధం ఉంది. నాటి తరం షర్మిలా ఠాగూర్ నుంచి నేటి తరం అనుష్క శర్మ వరకు. ఒక్కో నటికి ఒక్కో క్రికెటర్ అంటే అభిమానం ఉంటుంది.

- Advertisement -