అనుష్క కోసం ఐదు కోట్లు…

228
anushka
- Advertisement -

బాహుబలి తర్వాత రానా తప్పితే ఇంతవరకు ఏ ఒక్కరు వారి నెక్స్ట్ సినిమాను రిలీజ్ చేయలేదు. ఆఖరికి దర్శకుడు రాజమౌళి కూడా నెక్స్ట్ సినిమా పై పూర్తి క్లారిటిని కూడా ఇవ్వలేదు. ఇక బాహుబలి ప్రభాస్ మాత్రం తన నెక్స్ట్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే అనుష్క కూడా తన బాగమతి సినిమాతో బిజీగా ఉంది. కానీ సినిమాకు సంబందించిన ఒక్క ఫొటోను కూడా అమ్మడు రిలీజ్ చేయలేదు. ప్రస్తుతం బాగమతి గ్రాఫిక్స్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. పిల్ల జమిందార్ దర్శకుడు జి. అశోక్ ఆ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. విజువల్ వండర్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది.

Anushka-Shetty-

అయితే సినిమా ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావొచ్చింది.’భాగమతి’ షూటింగు సమయంలో కూడా అనుష్క అధిక బరువుతోనే వుందట. దాంతో ఆమెను కొంత నాజూకుగా చూపించడానికి గ్రాఫిక్స్ సాయాన్ని తీసుకుంటున్నారని అంటున్నారు. ఇందుకోసం అదనంగా మరో 5 కోట్లను ఖర్చు చేస్తున్నట్టుగా సమాచారం. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.  ‘అరుంధతి’ .. ఓ ‘రుద్రమదేవి’ మాదిరిగా ‘భాగమతి’ కూడా అనుష్కకి మంచి పేరు తీసుకువస్తుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు.

- Advertisement -