త్వరలో జగన్ బయోపిక్‌..!

243
anurag kashyap

ఒంటరిగానే వచ్చాడు ఒంటరిగానే పోరాడాడు. పదేళ్ల రాజకీయ జీవితం, వైసీపీ అధినేతగా ఎనమిదేళ్ల ప్రయాణం,ఏపీ ప్రతిపక్ష నేతగా ఐదేళ్ల పోరాటం ఇలా అన్నింటిలోనే ఆయన అడుగులు ఒంటరిగానే పడ్డాయి. నిక్కచ్చిగా నిష్కలంగా అడుగులేశాడు.జనం కోసమే ఉండాలంటే జనంతోనే ఉండాలన్నే ఆలోచనతో ఓదార్పు యాత్ర,దీక్షలు,పాదయాత్ర ఏం చేసినా జనం మధ్యే ఉంటూ జననేతగా అడుగులేశారు. నేను విన్నాను నేను ఉన్నాను అంటూ భరోసా ఇచ్చారు. పదేళ్లుగా జనం మధ్యలోనే ఉన్న జగన్‌ ఒంటరిగానే విజయం సాధించారు. ఫలితం ప్రజల అంచనాలను,ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి విజయం సాధించి జగన్‌ ఏపీ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు.

3000 కిలో మీటర్ల పాదయాత్ర,ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనుకబడుగు వేయలేదు. దేశమంతా మోడీ హవా వీస్తున్న ఏపీలో మాత్రం జగన్‌ సునామీకి టీడీపీతో పాటు బీజేపీ కూడా దిమ్మతిరిగింది. వైసీపీకి 22 స్ధానాలు కట్టబెట్టి తిరుగులేని మెజార్టీని అదించారు ప్రజలు. ప్రభుత్వాలు,ప్రత్యర్థులు,పరిస్థితులు ఒక్కటైనా తను నమ్మిన సిద్ధాంతాన్ని వీడలేదు. అన్ని సందర్భాల్లోనూ తనను తాను నమ్ముకున్న జగన్‌..ప్రతి మలుపులోనూ ఒంటరిగానే అడుగులేశాడు. ఫలితంగా ఒంటిచేత్తో వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చాడు.

ఈ నేపథ్యంలో త్వరలోనే జగన్‌ జీవిత చరిత్ర నేపథ్యంలో బయోపిక్ తెరకెక్కనుంది. జాతీయ అవార్డు దర్శకుడు,నిర్మాత అనురాగ్ కశ్యప్‌ జగన్‌ చరిత్రను సినిమాగా తీసే యోచనలో ఉన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్టోరీ చూస్తుంటే ఆయనపై సినిమా తీయాలని ఉందని ట్వీట్ చేశారు. గతంలో ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ స్టర్లు, 70వ దశకంలో ముంబై మాఫియాల మీద సినిమాలు తీసిన దర్శకుడు అనురాగ్.. జగన్‌పై సినిమా తీస్తాననడం విశేషం.

anurag

https://twitter.com/priyaramani/status/1132236998444367874