రామలక్ష్మీ పాత్ర నేను చేయాల్సింది.. కానీ…

314
Anupamaparameshwaran and samantha
- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో చేసింది తక్కువ సినిమాలే అయినా.. మంచి గుర్తింపు ఏర్పర్చుకుంది అనుపమపరమేశ్వరన్. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. తాజాగా ఆమె సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా రూపొందిన ‘తేజ్ ఐ లవ్ యూ’ సినిమాలో కథానాయికగా నటించింది. ఈ సినిమా ఈనెల 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రేమోషన్స్ లో భాగంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనుపమ మాట్లాడూతూ. ఆధునిక భావాలు కలిగిన అమ్మాయి ‘నందిని’ అనే అమ్మాయి పాత్రలో తాను నటించానని చెప్పింది. నందిని పాత్ర తనకు బాగా నచిందని చెప్పుకొచ్చింది.

Anupamaparameshwaran

ఈ సందర్భంగా.. రంగస్థలం రామలక్ష్మీ పాత్ర గురించి ప్రస్తావించారు. రామలక్ష్మీ పాత్ర తాను చేయాల్సి ఉండేదని, కానీ కొన్ని కారణాల వలన కుదరలేదని చెప్పారు. కానీ రామలక్ష్మీ పాత్రలో సమంత అద్భుతంగా నటించిందని, ఆమె రామలక్ష్మీగా అందరి మనసులు దోచుకున్నారని తెలిపారు. కీర్తి సురేష్ కూడా ‘మహానటి’ లో అలనాటి సావిత్రిగా ఒదిగిపోయారని అన్నారు. ఇక సమ్మోహనంలో అదితీ రావు నటన, తనను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పింది. ఈ ముగ్గురి నటనకు నేను ఫిదా అయిపోయానని, ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుంటానని చెప్పారు.

- Advertisement -