- Advertisement -
వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు నటుడు శర్వానంద్. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా శర్వా కెరీర్లో ఇది 38వ చిత్రం. ఈ సినిమాపై సినీ సర్కిల్స్‌తో పాటు ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
తాజాగా ఈ సినిమా నుండి సాలిడ్ అప్డేట్ రివీల్ చేశారు. శర్వానంద్ సరసన అందాల భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తుండగా ఇందుకు సంబంధించి ఓ ప్రీ-లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
దీంతో ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా ప్రముఖ నిర్మాత కె.కె.రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేస్తున్నారు.
Also Read:పాకిస్తానీయులకు పోలీసుల నోటీసులు
- Advertisement -

