ఆయనతో అర నిమిషం నటించినా చాలు..

269
Anupama-Parameswaran
- Advertisement -

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయనతో ఒక్క ఫోటో దిగాలని అభిమానులు, అలాగే ఒక్కసారైనా ఆయనతో కలిసి నటించాలని నేటి తరం యువ నటులు, నటీమణులు ఆరాటపడుతుంటారు. ఇక హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సైతం చిరంజీవిపై తనకు ఉన్న అభిమానాన్ని తెలిపింది. ఆయనతో కలిసి అర నిమిషం నటించినా చాలు… జన్మధన్యమైనట్టే అంటూ ఓ కార్యక్రమంలో చెప్పుకొచ్చింది.

anupama-parameswaran-and-chiranjeevi

తన అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి అని, ఆయనతో ఒక్కసారైనా కలిసి నటించాలనేది తన కోరిక అంటూ మనసులోని మాటను చెప్పింది. ఇక తన అభిమాన కథానాయిక నిత్యామీనన్ అని తెలిపింది. తెలుగు చిత్రపరిశ్రమకు తొలుత వచ్చినప్పుడు తెలుగు మాట్లాడడం రాక చాలా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చింది. ఇప్పుడు తెలుగు స్పష్టంగా మాట్లాడగలని చెప్పింది.

మరోవైపు సావిత్రి సినిమా అద్భుతంగా ఉందని, సావిత్రి మహానటి అంటూ కొనియాడింది. ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగు, తమిళం, మళయాళ భాషలలోని చిత్రాలలో నటిస్తూ.. ఫుల్ బిజీగా ఉంది. యంగ్ హీరో రామ్ హలో గురు ప్రేమకోసమే, శర్వానంద్ ‘పడి పడి లేచే మనసు’ వంటి చిత్రాలలో నటిస్తోంది.

- Advertisement -