హోమ్లీ బ్యూటీ పై బికినీ వార్తలు

40
- Advertisement -

హోమ్లీ బ్యూటీ ‘అనుపమ పరమేశ్వరన్’ మొన్నటివరకూ పద్దతికి పర్యాయపదంలా ఉండేది. కానీ, “టిల్లు స్క్వేర్” సినిమా ప్రమోషన్స్ కంటెంట్ తో ‘అనుపమ పరమేశ్వరన్’ ఒక్కసారిగా హాట్ బ్యూటీగా ఫేమస్ అయింది. ఈ “టిల్లు స్క్వేర్” సినిమాలో అనుపమ అందం, ఆమె సెక్సాప్పీల్ కుర్రకారుని బాగా ఆకట్టుకుంటున్నాయి. “రాధిక 2” అనే క్యారెక్టర్ తో అనుపమ కూడా అదరగొట్టింది అంటున్నారు. ఐతే, ఈ సినిమా సక్సెస్ ఐతే, అందుకు ప్రధాన కారణం అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ టచే అని అప్పుడే వార్తలు వస్తున్నాయి. నిజానికి సిద్దూ జొన్నలగడ్డ డైలాగ్స్, అతని నటన ఫుల్ ఎంటర్ టైన్ గా ఉంటాయి.

అలాంటిది, ఈ సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’ లో మాత్రం ‘అనుపమ పరమేశ్వరన్’ పేరే ఎక్కువుగా వినిపిస్తోంది. మరోవైపు, ఈ సినిమాలో బాగా సూపర్ హిట్టైన అనుపమ పరమేశ్వరన్ బోల్డ్ లుక్ సినిమాలో ఉండదు అని టాక్. సెన్సార్ అభ్యంతరంతో ముందే అనుపమ పరమేశ్వరన్ పై ఉన్న కొన్ని బోల్డ్ సీన్స్ ను సినిమా నుంచి తీసేశారట. అనుపమ పరమేశ్వరన్ – సిద్ధూ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు సినిమాలో ఎక్కువుగా ఉన్నాయట. కానీ, వాటిలో కొన్నిటిని లేకుండానే సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. సినిమా రిలీజ్ నాలుగు రోజులకు మళ్లీ కొన్ని బోల్డ్ సీన్స్ యాడ్ చేస్తారట.

అలాగే, ఈ సీన్స్ అనుపమ పరమేశ్వరన్ తన బికినీ అందాలను యథేచ్ఛగా ప్రదర్శించింది అని టాక్. అలాగే కొన్ని శృంగార పరమైన డ్యాన్స్ స్టెప్స్ కూడా అనుపమ పరమేశ్వరన్ వేసిందట. అందుకే, ఈ బోల్డ్ సీన్స్ అన్నిటిని ఒకేసారి వదలకుండా గ్యాప్ ఇచ్చి వదులుతూ వారం పాటు సినిమాకి కలెక్షన్స్ ను రాబట్టాలని మేకర్స్ ఆలోచన చేస్తున్నారు. మరి ఈ ఆలోచన ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Also Read:అంబాజీపేట మ్యారేజి బ్యాండు.. ఆకట్టుకుంటుంది

- Advertisement -