- Advertisement -
అ ఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. ఆ తర్వాత వరుస సినిమాలో బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయిన అనుపమ రీసెంట్‌గా కార్తీకేయ 2తో సక్సెస్ కొట్టింది. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్‌తో పాటు దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా స్పందించింది.
మహిళలు అన్ని రకాలుగా సాధికారత సాధించారు. మళ్లీ దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు పదే పదే మహిళలు వెనుకబడి ఉన్నారని చెప్పకండి. మీరు అలా చెప్పడం వల్లే నిజంగానే వెనుకబడి ఉన్నారనే భావన కలుగుతోందన్నారు. అన్నిరంగాల్లో మగవారితో సమానంగా మహిళలు దూసుకుపోతున్నారని..తనకు తెలిసి సాధికారత అసలు మహిళలకే వచ్చింది, మగవాళ్లకే రాలేదనిపిస్తుందని వెల్లడించింది.
- Advertisement -