మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటనా నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రేమమ్‌తో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ఈ అమ్మడు వైవిధ్యమైన చిత్రాలలో నటించి అందరి మనసులు గెలుచుకుంది. ఆమె తాజా చిత్రం హలో గురు ప్రేమ కోసమే అక్టోబర్ 18న దసరా శుభాకాంక్షలతో విడుదల కానుంది.
సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మాట్లాడిన అనుపమ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తాను సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా చదువును మాత్రం వదిలేది లేదని తేల్చిచెప్పారు.
హీరో రామ్‌తో రెండోసారి చేస్తున్నా.. ‘ఉన్నది ఒకటే జిందగీ’ తరువాత వెంటనే ఆయనతో నాకు నటించే అవకాశం వచ్చిందన్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మంచి మ్యూజిక్ అందించారని తెలిపారు.
హలో గురు ప్రేమ కోసమే నా 7వ సినిమా అని శతమానం భవతి తర్వాత దిల్ రాజుతో చేసిన రెండో సినిమా ఇది అన్నారు.ఈ చిత్ర దర్శకుడు త్రినాథరావు నక్కిన చాలా ఫన్నీగా ఉంటారు. నన్ను షూట్‌లో బాగా ఏడిపించేవారని తెలిపారు.