యంగ్ హీరో నాని హీరోగా తెరకెక్కిన ‘మజ్ను’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళం బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్. మొదటి సినిమాతో ఇటు అందం అటు అభినయంతో ఆకట్టుకుంది ఈ భామ. ఆ తర్వాత రాజ్ తరుణ్ తో కిట్టుగాడు జాగ్రత్త, గోపీచంద్ తో ఆక్సిజన్ లాంటి సినిమాలు అయితే వచ్చాయి కానీ సక్సెస్ లు అయితే రాలేదు.
ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అజ్ఞాతవాసిలో హీరోయిన్ గా అవకాశం వచ్చినప్పటికీ ఆమె దురదృష్టం కొద్ది ఆ సినిమా కూడా ప్లాప్ అయింది. తర్వాత శైలజారెడ్డి అల్లుడు, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రాలు పర్వాలేదు అనిపించాయి. ఇక ఈ సినిమాల తర్వాత అనూ ఇమ్మాన్యుయేల్ మళ్ళీ వెండితెరపై కనిపించింది లేదు..
తాజాగా వెబ్ సిరీస్‌తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి వెబ్ సిరీస్‌తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్న అనుకు ఇకనైనా కాలం కలిసివస్తుందా లేదా చూడాలి..