యువత మత్తుకి బానిస కావద్దు:యశస్వి మల్కా

14
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు యశస్వి మల్కా ( సి ఇ ఓ ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ , నాచారం ) చేతుల మీదుగా యువత మేలుకో ( NGO ) స్వచ్చంద సంస్థ యొక్క #AntiDrugsCampaign పోస్టర్ నీ ఆవిష్కరించారు .

యువ విద్యార్థి లోకం మన భారతదేశం , అలాంటి యువత మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు, దాని వల్ల అమూల్యమైనా యువత యొక్క జ్ఞాన సంపద నిర్వీర్యం అవుతుందని అది ఎంతోగానీ బాధాకరమైన విషయం , ఈ సందర్భంగా పిల్లలకు అవగాహన కల్పించడం కోసం తెలంగాణ ఆంటీ డ్రగ్ వారియర్ లో తను భాగస్వామ్యం అవుతానని , తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు , ఆంటీ డ్రగ్స్ విభాగం చాలా ప్రతిష్టాత్మకంగా డ్రగ్స్ లేని రాష్ట్రం నిర్మూలించాలని సకల్పించింది .. దానికోసం తనవంతు సహకారం అందిస్తానని యశస్వి మల్కా గారు తెలిపారు . ఈ నెల 27 వ తేదీన పల్లవి స్కూల్స్ ఆల్వాల్ లో ప్రొగ్రామ్ చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఫౌండర్ పురుషోత్తం చాట్లపెల్లి పాల్గొన్నారు.

Also Read:పేమెంట్ కోటాలో వచ్చావా?, రేవంత్‌కు కేటీఆర్ కౌంటర్

- Advertisement -