- Advertisement -
ఆస్ట్రేలియా నూతన ప్రధానిగా ఆంటోని అల్బనీస్ ఎన్నికయ్యారు. శనివారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని స్కాట్ మారిసన్ నేతృత్వంలోని లిబరల్-నేషనల్ కూటమిపై విపక్ష లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది.
మొత్తం 151 స్థానాలకుగాను 72 స్థానాల్లో గెలుపొందింది. మారిసన్ పార్టీ కేవలం 52 స్థానాలకే పరిమితం కాగా, ఏడుగురు ఇండిపెండెంట్లు గెలుపొందారు. దీంతో ఆస్ట్రేలియా 31వ ప్రధానిగా ఆంటోని బాధ్యతలు చేపట్టనున్నారు.
అల్బనీస్ 1963లో జన్మించారు. 1996తో తొలిసారిగా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2013లో ఉప ప్రధానిగా కొంతకాలం పనిచేశారు.
- Advertisement -