టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంతరిక్షం’.వరుణ్ సరసన లావణ్య త్రిపాఠి,అదితి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చింది. తొలిసారిగా వ్యోమగామి పాత్రలో నటించిన వరుణ్ ఏ మేరకు మెప్పించారు..?ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా చూద్దాం..
కథ :
వరుణ్ తేజ్(దేవ్) చంద్రుని పై విప్రయాన్ శాటిలైట్ ను పంపే ప్రాసెస్ ఉంటారు. అయితే అనుకోకుండా జరిగే కొన్ని ఇబ్బందికర పరిస్థితుల వల్ల తను ప్రేమించిన పారు (లావణ్య త్రిపాఠి)ని కొల్పోవడంతో పాటు విప్రయాన్ మిషన్ ఫెయిల్ అవుతుంది. తర్వాత మిషన్‌ను పూర్తిచేసే క్రమంలో దేవ్‌కి ఎదురయ్యే సమస్యలేంటీ..? విప్రయాన్ మిషన్ ని ఎలా పూర్తి చేశాడు ? అన్నదే సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ ‘అంతరిక్షం’ నేపథ్యం,ఆకట్టుకునే సీన్స్,ప్రీ క్లైమాక్స్. దేవ్ పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. లావణ్య త్రిపాఠి తన నటనతో ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన అతిథిరావ్ కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది. మిగితా నటీనటులు తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్ :
సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ కథనం,ప్రీ ఇంటర్వెల్ సీన్,స్పేస్ సినిమాల్లో ఉండాల్సిన సీరియస్ నెస్ లేకపోవడం. కథను బాగానే రాసుకున్న దర్శకుడు కథనాన్నిమాత్రం పూర్తి ఆసక్తికరంగా మలచలేకపోయారు. కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి.
సాంకేతిక విభాగం :
సాంకేతికంగా సినిమా సూపర్బ్. స్పేస్ నేపథ్యంలో రూపొందించిన సన్నివేశాలు, విఎఫ్ఎక్స్ వర్క్ సూపర్బ్.ఇప్పటివరకు ఏ తెలుగు దర్శకుడు టచ్ చేయని స్పేస్ జానర్‌ను తీసుకున్న సంకల్ప్‌ని అభినందించాల్సిందే. ప్రశాంత్ విహారి అందించిన సంగీతం బాగుంది. జ్ఞాన శేఖర్ వి.యస్ సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకే హైలైట్.
తీర్పు :
సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెలుగులో మొట్టమొదటి సారిగా స్పేస్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన చిత్రం అంతరిక్షం. స్పేస్‌లో సాగే సన్నివేశాలు,విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా నెమ్మదిగా సాగిన కథనం, లాజిక్ లేని కొన్ని కీలక సన్నివేశాలు మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’ తెలుగు ప్రేక్షకులకు ఒక సరి కొత్త అనుభూతినిస్తుంది.
విడుదల తేదీ : 21/12/ 2018
రేటింగ్ : 2.75/5
నటీనటులు : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అతిధి రావ్
సంగీతం : ప్రశాంత్ విహారి
నిర్మాత : రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి
దర్శకత్వం : సంకల్ప్ రెడ్డి