హిలేరియ‌స్‌గా ‘అంటేసుంద‌రానికీ’ట్రైల‌ర్‌..

113
nani
- Advertisement -

ఇటీవ‌లే విడుద‌లైన అంటేసుంద‌రానికీ టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. తాజాగా మేక‌ర్స్ ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ‘నాకు పెద్ద కోరిక‌లేం లేవండి.. నేను కూడా ఒక సారి అమెరికాకు వెళ్ళి ఇక్క‌డున్న ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసి.. నేను కాలీఫోర్నియాలో ఉన్నాను ఇక్క‌డ వ‌ర్షాలేంట్రాబాబు ఓ మై గాడ్ అని ఒక్క‌సారి మాట్లాడితే చాలండి.. స్టైలిష్‌గా’ అంటూ నాని ప‌లికే సంభాష‌ణ‌లు,‘నా జీవితానికి మా నాన్న, బామ్మ వీళ్ళంద‌రు స‌రిపోర‌న్న‌ట్టు ఈ లిస్ట్‌లోకి కొత్త క్యాండిడెట్ వ‌చ్చింది’ అంటూ న‌జ్రియా ప‌రిచ‌య‌మ‌య్యే సన్నివేశాలు,‘కార్లా.. వ‌ర‌ల్డ్స్ ఫ‌స్ట్ ఫీమేల్ ఫోటోగ్రాఫ‌ర్ త‌ను ఫ‌స్ట్ తీసిన ఫోటో ఎక్క‌డో తెలుసా.. అందుకే నా పెళ్ళి అక్కడే చేసుకుందామ‌నుకుంటున్నా’ అంటూ న‌జ్రియా నేచురల్ డైలాగ్స్ అందరిని ఆక‌ట్టుకుంటున్నాయి. ట్రైల‌ర్ మ‌ధ్యలో ‘చిన్న‌క‌ళ్ళ‌తో పెద్ద చూపు చూడాలి కాని.. పెద్ద క‌ళ్ళ‌తో చిన్న చూపు చూడకూడదు’ అంటూ పృథ్వి చెప్పే డైలాగ్స్ హిలేరియ‌స్‌గా ఉన్నాయి.

నేచురల్ గా మన ఇంట్లో మనిషిలా అనిపించే అతికొద్ది మంది న‌టుల‌లో నాని ఒక‌రు. ఈయ‌న సినిమా కోసం అభిమానులే కాదు ప్రేక్ష‌కులు కూడా ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తుంటారు. నాని నేచురల్ స్టార్ హీరోగా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్ర‌స్తుతం ఈయ‌న హీరోగా న‌టించిన లేటెస్ట్ చిత్రం ‘అంటే సుంద‌రానికీ’ వివేక్ ఆత్రేయా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల‌లో మొద‌టి నుంచి భారి అంచ‌నాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సంబందించిన టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ అంచ‌నాలను అమాంతం పెంచేశాయి. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం జూన్ 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో చిత్ర‌బృందం త‌ర‌చూ ఒక అప్‌డేట్‌తో ప్రేక్ష‌కులను అల‌రిస్తుంది.

ఈ చిత్రంలో నానికి జోడీగా న‌జ్రియా హీరోయిన్‌గా న‌టించారు. న‌జ్రియా న‌టించిన‌ ఈ చిత్రం తెలుగులో తనకు మొద‌టిది కావ‌డం విశేషం. ఈ చిత్రంలో నాని బ్ర‌హ్మ‌ణుడి పాత్ర‌లో,నజ్రియా క్రిస్టియ‌న్ అమ్మాయిగా న‌టించారని ట్రైల‌ర్‌లో తెలుస్తుంది . మైత్రీ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ సాగ‌ర్ సంగీతం అందించారు. ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో ఒకేసారి విడుద‌లకానుంది.

- Advertisement -