అంటే సుందరానికి…టీజర్ డేట్ ఫిక్స్!

88
nani
- Advertisement -

నేచురల్ స్టార్ నాని రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే.. సుందరానికి’ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకొంటుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ వై నిర్మాతలుగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్ర వినూత్న ప్రచారం సినీ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తినిపెంచుతోంది.

తాజాగా సినిమాకు సంబంధించి అప్‌డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ నెల 20న ఉదయం 11.07 గంటలకు టీజర్ రిలీజ్ కానుందని అందాక stay tuned అని పేర్కొంది.

నాని సరసన నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంతోనే ఆమె టాలీవుడ్ అరంగేట్రం చేయడం మరో విశేషం. ఈ చిత్రానికి రవితేజ గిరిజాల ఎడిటర్‌గా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. జూన్ 10న ప్రేక్షకుల ముందుకురానుంది.

- Advertisement -