వరుణ్ తేజ్‌..అంతరిక్షం ట్రైలర్‌

258
varuntej anthariksham
- Advertisement -

ఫిదా, తొలి ప్రేమ చిత్రాల‌తో మంచి ఫామ్‌లో ఉన్న హీరో వరుణ్ తేజ్‌. ప్రస్తుతం ఘాజీ ఫేం సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అంత‌రిక్షం అనే చిత్రాన్ని చేస్తున్నాడు. వరుణ్ సరసన లావ‌ణ్య‌ త్రిపాఠి, అధితి రావు హైద‌రీ హీరోయిన్లుగా నటిస్తుండగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్‌ని విడుదల చేశారు.

దేవ్ పాత్ర‌లో వ‌రుణ్ తేజ్ క‌నిపించ‌నుండ‌గా, రియా పాత్ర‌లో అదితి రావు హైద‌రి, పార్వ‌తి పాత్ర‌లో లావ‌ణ్య త్రిపాఠి క‌నిపించ‌నుంది. ప్రశాంత్ ఆర్. విహారి చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా, త్వ‌ర‌లోనే ఆడియో విడుద‌ల చేయ‌నున్నారు.

ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. హాలీవుడ్‌ స్థాయి టేకింగ్‌తో అద్భుతమైన విజువల్ వండర్‌గా ‘అంతరిక్షం’ ఉండబోతుందని తెలుస్తుంది. డిసెంబర్‌ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా ఆ ట్రైలర్‌పై మీరు ఓ లుక్కేయండి..

- Advertisement -