సినీ ప్రపంచంలో ఆడవాళ్ళకు విలువ లేదా?

43
- Advertisement -

సినిమా ప్రపంచంలో ఆడవాళ్ళకు విలువ లేదా ?, ఒక్క హీరోయిన్లకే కాదు, సహాయ నటీమణులకు చివరకు సీనియర్ నటీమణులు సైతం ఏదో రకంగా బాధింప పడుతూనే ఉన్నారు. నిన్నటికి నిన్న అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రముఖులు మాట్లాడుతూ ఉండగా.. జయసుధ మాత్రం ఫోన్‌లో బిజీగా ఉంది. దీంతో పక్కనే ఉన్న మోహన్ బాబు సీరియన్ గా జయసుధ చేతిలో నుంచి ఫోన్ లాక్కుందామని ప్రయత్నించాడు. దాంతో ఒక్కసారిగా షాక్ కి గురైన జయసుధ, మోహన్ బాబు వైపు సీరియస్ గా చూసింది.

అయినప్పటికీ.. మోహన్ బాబు మాత్రం ఆమె వైపు అంతే కోపంగా చూశాడు. వేడుకల్లో ప్రముఖులు మాట్లాడుతూ ఉండగా.. జయసుధ ఫోన్‌లో చూస్తూ ఉండటం మోహన్ బాబుకి నచ్చకపోవచ్చు. అంతమాత్రాన నిండు వేడుకలో ఆయన ఇలా చేయకుండా ఉండాల్సింది. ఇక మొన్నటికి మొన్న తమిళ నటుడు కూల్‌ సురేశ్‌ ఓ మహిళా యాంకర్‌తో అనుచితంగా ప్రవర్తించాడు. సరక్కు సినిమా మ్యూజిక్‌ లాంచ్‌ ఈవెంట్‌కు హాజరయ్యాడు. అయితే స్టేజీపై ఉన్న ఆయన పక్కనే ఉన్న యాంకర్‌ మెడలో పూలమాల వేయడంతో ఇబ్బందిగా ఫీలై ఆ యాంకర్‌ మాలను తీసి పడేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది.

Also Read:కొత్తిమీరతో ఆరోగ్య ప్రయోజనాలు..!

ఈ విషయంపై సదరు యాంకర్ ఆగ్రహం వ్యక్తం చేసినా.. నటుడు కూల్‌ సురేశ్‌ పట్టించుకోలేదు అంటే ఏమనుకోవాలి?, వీళ్లకు ఆడవాళ్ళను ఎలా గౌరవించాలో తెలియదా ?, లేక సినిమా వాళ్లే కదా.. కాబట్టి వాళ్ళతో ఎలా ప్రవర్తించినా తప్పు లేదు అని భావిస్తున్నారా ?, మన ఇంట్లో ఆడవాళ్లను ఎలా చూసుకుంటామో బయట వారిని అలాగే చూసుకోవాలని సదరు సినీ ప్రముఖులకు తెలియక పోవడం నిజంగా దురదృష్టకరం.

Also Read:Tirumala:గోవింద కోటి పుస్తకాల పంపిణీ

- Advertisement -