బీజేపీలోకి మరో ఇద్దరు కాంగ్రెస్ సీనియర్లు

269
congress-bjp
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ కు వలసలతో వరుస షాక్ లు తగులుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 9మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఆపార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలందరూ గులాబీ గూటికి చేరుతుంటే తాజాగా మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు డికె.అరుణ బీజేపీలో చేరారు. ఇక డి.కె అరుణ బాటలో మరికొంత మంది మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీజేపీ తీర్ధం పుచ్చుకొనున్నట్లు తెలుస్తుంది. అందుకు బీజేపీ అధిష్టానం ఆ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారట. బీజేపీ ప్రధాన కర్యదర్శి రాంమాధవ్ కాంగ్రెస్ లో అసంతృప్తిగా ఉన్న నేతలతో చర్చలు జరుపుతున్నారట. ఖమ్మం మాజీ ఎంపీ రేణుకా చౌదరికి ఈసారి ఎంపీ టికెట్ ఇవ్వకపోతే తన దారి తాను చూసుకుంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

అలాగే ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా ఖమ్మం పార్లమెంట్ స్ధానాన్ని ఆశిస్తున్నారు. వీరిద్దరికి కాకుండా గాయత్రి రవికి ఖమ్మం ఎంపీ సీటు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ కు చెందిన కీలకమైన నేతలకు బీజేపీ గాలం వేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. రేణుకా చౌదరి, పొంగులేటి సుధాకర్ రెడ్డితో బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది. మరో వైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కూడా బీజేపీ అధిష్టానంతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా మెదక్ జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెన్ నేతలతో కూడ బీజేపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది. మరో వైపు నల్గొండ జిల్లాకు చెందిన కొందరు నేతలతో కూడ బీజేపీ కీలక నేతలు సంప్రదింపులు జరుపుతునట్టు తెలుస్తోంది. ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి ఈసారి టీఆర్ఎస్ తరపున టికెట్ రాదని ప్రచారం జరుగుతుండటంతో ఆయనతో కూడా బీజేపీ అధిష్టానం టచ్ లో ఉన్నట్లు తెలుస్తుంది.
.

- Advertisement -