వైసీపీకి మరో షాక్!

15
- Advertisement -

ఏపీలో వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేయగా తాజాగా అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి జీవీఎంసీ నోటీసులు ఇచ్చింది. అనకాపల్లి మండలం రాజుపాలెం గ్రామ సర్వే నంబర్ 75/3లో ప్లాన్ అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేశారని నోటీసులలో తెలిపింది.

ఏడు రోజుల్లో సమాధానం ఇవ్వకుంటే తదుపరి చర్యలు ఉంటాయని జీవీఎంసీ హెచ్చరించింది. అయితే, పట్టణ ప్రణాళిక అధికారులు వైసీపీ పార్టీ కార్యాలయంకి అంటించిన నోటీసులను మాజీ మంత్రి అమర్నాథ్ తీసేశారు. జీవీఎంసీ నోటీసులు ఇచ్చారు కాబట్టి దానిని భద్రపరుచుకునేందుకు గోడమీద నుండి తీశామని తెలిపారు.

Also Read:Pawan:పవన్ ఫస్ట్ స్పీచ్..నవ్వులే నవ్వులు

- Advertisement -