అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో రవిప్రకాశ్‌కు చుక్కెదురు

298
tv9 ravi prakash
- Advertisement -

ఫోర్జరీ కేసులో టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు ఉన్న అన్ని దారులు మూసుకుపోతున్నాయి. తమ ఎదుట హాజరుకావాలంటూ బుధవారం ఉదయం 11 గంటల వరకు సమయం ఇస్తూ సైబరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు నోటీసులు జారీచేసినా రవిప్రకాశ్ విచారణకు డుమ్మాకొట్టారు. తాను పదిరోజుల వరకు విచారణకు హాజరుకాలేనని మెయిల్ ద్వారా తెలిపారు రవిప్రకాశ్‌. మెయిల్ ద్వారా రవిప్రకాశ్‌ ఏపీలో ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన అరెస్ట్‌కు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో రవిప్రకాశ్‌,శివాజీకి చుక్కెదురు అయింది. ఏబీసీఎల్‌లో జరిగిన మార్పులపై స్టే విధించి యధాతథ స్థితిని కొనసాగించాలని రవిప్రకాశ్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ట్రిబ్యునల్‌ ఎనిమిది మందికి నోటీసులు ఇచ్చింది. అయితే దీన్ని సవాల్‌ చేస్తూ.. ఏబీసీఎల్‌ను టేకోవర్‌ చేసిన అలంద మీడియా నేషనల్ ఢిల్లీలోని కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో అప్పీల్‌ పిటిషన్‌ వేసింది.

దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్‌ హైదరాబాద్‌ ఎన్‌సీటీఎల్‌లో జరిగే కేసు విచారణపై జూలై 9వ తేదీ వరకూ స్టే ఇచ్చింది. జూలై 12 వరకు ఎలాంటి ప్రొసిడింగ్స్ జరగడానికి వీల్లేదని స్పష్టం చేస్తు విచారణను వాయిదా వేసింది. దీంతో చివరివరకు రవిప్రకాశ్‌ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

- Advertisement -