వైసీపీకి మరో షాక్‌..ఇద్దరు ఎమ్మెల్సీల రాజీనామా

7
- Advertisement -

ఏపీలో వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇద్దరు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేసి 24 గంటలు గడవక ముందే మరో ఇద్దరు ఎమ్మెల్సీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవులకు కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి రాజీనామా చేశారు.

మండలి చైర్మన్‌ను కలిసి రాజీనామాలు అందజేయనున్నారు కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి. ఎమ్మెల్యే కోటాలో బల్లి కళ్యాణ చక్రవర్తి ఎమ్మెల్సీగా ఎన్నిక కాగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు కర్రి పద్మశ్రీ.

ఇప్పటికే సీనియర్ నేతలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌ రావు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయగా త్వరలో టీడీపీలో చేరనున్నారు.

Also Read:ఎన్నికల కోసమే హైడ్రా..డీకే అరుణ ఫైర్

- Advertisement -