జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు చేయడంతో పాటు ఆ దేశ పౌరులను తిరిగి పంపించింది. పాక్ విమానాలను మన గగనతలలంలోకి రాకుండా చర్యలు చేపట్టింది.
తాజాగా ఆ దేశం నుంచి మన దేశానికి వచ్చే అన్ని రకాల ఉత్పత్తులపై నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. పాకిస్థాన్ నుంచి భారత దేశానికి ప్రత్యక్ష దిగుమతులు చాలా తక్కువగా ఉన్నప్పటికీ.. కొన్ని వస్తువులు పరోక్ష మార్గంలో, మూడో దేశాల ద్వారా దేశంలోకి ప్రవేశిస్తున్నాయి.
అయితే వీటన్నిటిపై భారత్ నిషేధం విధించింది. అనుమతులు ఉన్నప్పటికీ ఉత్పత్తులైనా, స్వేచ్ఛాయుత దిగుమతులైనా పాకిస్థాన్ నుంచి అనుమతించబోమని వివరించింది. 2019లో పుల్వామా దాడి తర్వాత నుంచే దాయాది దేశం నుంచి అనేక వరకు దిగుమతులు తగ్గించుకున్న భారత్.. ఆ దేశ ఉత్పత్తులపై 200 శాతం సుంకం విధించింది.
Also Read:పత్తి కొనుగోళ్లలో కుంభకోణం: పెద్ది


