- Advertisement -
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు మరో షాక్ తగిలింది. 1990 దశకంలో బెర్గడోర్ఫ్ గుడ్‌మ్యాన్ స్టోర్‌లో పనిచేస్తున్న సమయంలో డోనాల్డ్ ట్రంప్ తనపై అత్యాచారం చేసినట్లు జీన్ కారెల్ అనే మహిళ గతంలో ఫిర్యాదు చేయగా దీనిపై కోర్టులో దావా వేశారు.
ట్రంప్ కావాలనే తనను భావోద్వేగానికి లోనయ్యేలా చేశారని పేర్కొన్నారు ఆమె తరపు న్యాయవాది. 1995 లేదా 96లో మన్‌హటన్‌లో ఉన్న ఓ డిపార్ట్మెంట్ స్టోర్‌లోని డ్రెస్సింగ్ రూమ్‌లో ట్రంప్ తనను రేప్ చేసినట్లు కారెల్ ఆరోపించారు. దీనిపై నవంబర్ 24న కేసు దాఖలు చేయనున్నట్లు కారెల్ లాయర్ తెలిపారు.
- Advertisement -