ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో రైతుసంఘాల ప్రతినిధుల తో భేటీ అయ్యారు కేంద్రమంత్రులు నరేంద్రసింగ్ తోమర్,పీయూష్ గోయల్. 41మంది రైతు సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొనగా వ్యవసాయ చట్టాలపై రైతుల అభ్యంతరాలను సవరణ చేస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి.
కర్నాల్‌లో సుమారు 900 మంది రైతులపై ఎఫ్ఐఆర్ నమోదుకు సంబంధించి సమావేశంలో చర్చ జరగనుంది.ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ద్వారా రైతులను భయపెడుతున్నారన్న ప్రతినిధులు తెలిపారు. బిల్లు అమలును కోర్టు నిలిపివేసిందని తెలిపారు కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్.అభ్యంతరాల పరిష్కారం పై మాట్లాడుకుందామని వెల్లడించారు తోమర్. సమస్య పరిష్కారానికి సలహా ఇవ్వాలని రైతు సంఘాలను కోరారు.
నిత్యావసర సరుకుల చట్టంపై వివరణ ఇచ్చారు కేంద్ర మంత్రి పియూష్ గోయల్. FCI అంతం కాదు.. FCI బలంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ చట్టంతో రైతులకు ఎంత ప్రయోజనం జరుగుతుందని వెల్లడించారు.