పోసానికి మ‌రో కేసులో రిలీఫ్..

16
- Advertisement -

నటుడు పోసాని కృష్ణమురళికి మరో రిలీఫ్ దక్కింది. పోసానిపై సూళ్లూరుపేట పోలీసులు కేసు నమోదు చేయగా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. పోసానిపై తదుపరి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.

ఈ కేసులో అదనంగా 111 సెక్షన్ తో పాటు మహిళను అసభ్యంగా చిత్రీకరించారంటూ సెక్షన్లు నమోదు చేయడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Also Read:NRI పాలసీ కోసం కమిటీ ఏర్పాటు

తమ ఆదేశాలను పట్టించుకోకుండా వ్యవహరించారంటూ విచారణ అధికారి మురళీకృష్ణపై సీరియస్ అయింది. ఈ సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించింది. మురళీకృష్ణకు ఫామ్ 1 నోటీసు జారీ చేసింది. రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -