Ram Charan:రామ్‌చరణ్ కు మరో ‘రంగస్థలం’ అవుతుందా!

26
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సనా కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. RC 16 గా ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ నటీనటుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే ఈ మూవీ పూర్తి స్థాయిలో సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ” గేమ్ చేంజర్ ” మూవీ చేస్తున్న చరణ్.. ఆ తర్వాత వెంటనే RC16 లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఫిల్మ్ సర్కిల్స్ లో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీ 1980 బ్యాక్ డ్రాప్ లో ఉన్నట్లు ఎప్పటి నుంచో రూమర్స్ వినిపిస్తున్నాయి, గతంలో చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో 1980 బ్యాక్ డ్రాప్ లో వచ్చిన రంగస్థలం ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దీంతో అదే జోనర్ లో తెరకెక్కుతున్న RC16 అంచనాలు భారీగా ఏర్పడ్డాయి .

ఇక RC16 లో చరణ్ క్యారెక్టర్ పై ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్ చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో చరణ్ క్రికెటర్ గా కనిపిస్తాడట. ఓ మధ్యతరగతి వ్యక్తి ఇంటర్నేషనల్ క్రికెటర్ గా ఎలా ఎదిగాడనే కథాంశంతో మూవీ తెరకెక్కబోతున్న ట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ జాహ్నవి కపూర్ నటిస్తున్నట్లు వినికిడి. ఉప్పెన తరువాత దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకొని ఎంతో పక్కాగా ఈ స్టోరీ రెడీ చేశాడట డైరెక్టర్ బుచ్చిబాబు. ఈ మూవీతో పాన్ ఇండియా స్థాయి లో రికార్డులపై కన్నెశాడు డైరెక్టర్ బుచ్చిబాబు. మరి రెండో సినిమాతోనే రాంచరణ్ లాంటి స్టార్ హీరోతో మూవీ చేస్తున్న బుచ్చిబాబు ఎంతవరకు మెప్పిస్తాడోనని అందరూ క్యూరియాసిటీతో ఉన్నారు. ఈ మూవీని 2025 సమ్మర్ లేదా 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ క్రేజీ కాంబినేషన్ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Also Read:నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయా.. !

- Advertisement -