బంగాళాఖాతంలో మరో అల్పపీడనం!

3
- Advertisement -

ఏపీకి మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉంది. ఇదే విషయాన్ని వాతావరణ శాఖ వెల్లడించింది. సెప్టెంబర్‌ 20 నుంచి 22 మధ్యలో మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని తెలిపింది వాతావరణ శాఖ. సెప్టెంబర్‌ 27వ తేదీ నాటికి ఇది తీరం సమీపానికి వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.

ఇది ఉత్తరాంధ్రకు దగ్గరగా వస్తుందని, అయితే ఒడిశా వైపు కదిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. ఈ తుపాను రాష్ట్రంపై ఎంత ప్రభావం చూపుతుందనే దానిపై వారం రోజుల్లో స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు.

వాయుగుండం ప్రభావం వల్ల ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో ఆది, సోమ వారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణలో కూడా వాయుగుండం ప్రభావంతో మంగళవారం కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జయశంకర్‌, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో వానలు పడుతాయని చెప్పింది. బుధవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని తెలిపారు అధికారులు.

Also Read:తెలంగాణకు కేంద్ర బృందం..

 

- Advertisement -