ఎన్టీఆర్ నుంచి మరో మల్టీస్టారర్

17
- Advertisement -

‘ఆర్ఆర్ఆర్‌’తో జూనియర్ ఎన్టీఆర్ ఇండియా వైడ్ గా మారుమోగింది. గతంలో, బాలీవుడ్ సినిమా ఆఫర్లు వచ్చినా.. ఎన్టీఆర్ మాత్రం అప్పట్లో పట్టించుకోలేదు. మరోవైపు సౌత్ హీరోలు హిందీలో సోలో హీరోగా ప్రయత్నిస్తే సక్సెస్ కాలేం అనే అపవాదు ఉంది. కానీ, అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. పైగా బాహుబలి సినిమా తర్వాత సౌత్ హీరోలకు బాగా డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ తో కొరటాల శివ ‘దేవర’ అంటూ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు.

అలాగే, ప్రశాంత్ నీల్ తో కూడా ఎన్టీఆర్ హీరోగా మరో పాన్ ఇండియా స్టార్ట్ కాబోతోంది. ఇలాంటి నేపథ్యంలో బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో ఓ సినిమా చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఈ కమిట్ మెంట్ దేనికోసం అన్నది క్లారిటీ లేదు. మల్టీ స్టారర్ నా? సోలో సినిమానా? అన్నది తెలియాల్సి వుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్, హృతిక్ రోషన్ తో వార్ 2 అనే ఓ భారీ మల్టీస్టారర్ చేస్తున్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో మరో మల్టీస్టారర్ చేస్తున్నాడా ?, అమీర్ ఖాన్ తో కలిసి ఎన్టీఆర్ నటించే అవకాశం ఉందా ?, లేదంటే ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత ఎన్టీఆర్ సోలో సినిమా చేస్తాడా ? అన్నది కొన్నాళ్ల తర్వాత కానీ తెలియదు. మొత్తానికి మన హీరోలు కూడా పాన్ ఇండియా పుణ్యమా అంటూ రెండు మూడేళ్లకు ముందుగా ప్లానింగ్ చేస్తున్నారు. అందువల్ల అన్ని వివరాలు తెలియడానికి చాలా టైమ్ పడుతుంది. ఒక్కటి మాత్రం స్పష్టం.. సంజయ్ లీలా భన్సాలీతో ఎన్టీఆర్ సినిమా పడితే ఆ రేంజే వేరు.

Also Read:Allu Arjun:పుష్ప 2 వెనక్కి తగ్గాల్సిందేనా?

- Advertisement -