బ్లాక్ బస్టర్ దళపతి టైటిల్ తో మరో మూవీ…

243
- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్ , మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కలిసి నటించిన మల్టీ స్టారర్ చిత్రం ” దళపతి ”. 1991 లో వచ్చిన ఈ దళపతి దక్షిణాదిన సంచలన విజయం సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది .

మణిరత్నం దర్శకత్వం వహించిన దళపతి దక్షిణాదిని ఓ ఊపు ఊపేసింది . కట్ చేస్తే ఇన్నాళ్ల తర్వాత అదే బ్లాక్ బస్టర్ ” దళపతి ”టైటిల్ తో తెలుగులో సినిమా రూపొందుతోంది . సదా , బాబు హీరోలుగా చేస్తున్న ప్రయత్నమే ఈ దళపతి .

another movie starts with dalapathi title

ఆది అక్షర ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సదా దర్శకత్వంలో బాబురావు పెదపూడి నిర్మించిన చిత్రం ” దళపతి ”. షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకున్న ఈ చిత్రంలో సదా – కవితా అగర్వాల్ , బాబు – ప్రియాంక శర్మ రెండు జంటలుగా నటిస్తున్నారు . యాజమాన్య సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రాన్ని బాబురావు పెదపూడి ఖర్చుకు వెనుకాడకుండా నిర్మిస్తున్నాడు .

ఈ సందర్బంగా దర్శకులు సదా మాట్లాడుతూ ” విభిన్న కథాంశం తో యాక్షన్ , ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న దళపతి చిత్ర షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయ్యిందని , ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉందని …… అలాగే మా సినిమా కు ఛాయాగ్రాహకులు జై అందించిన సినిమాటోగ్రఫీ హైలెట్ గా నిలవనుంది , జై అందించిన సహకారం వల్లే మా సినిమా అద్భుతంగా వచ్చిందని , జై అందించిన విజువల్స్ ప్రేక్షకులు థ్రిల్ ఫీలవ్వడం ఖాయమని అన్నారు .

నిర్మాత బాబురావు మాట్లాడుతూ ” దర్శకులు సదా చెప్పిన కథ నచ్చడంతో సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టానని , కథ చెప్పినట్లుగానే సినిమా బాగా తీసాడని ……. షూటింగ్ పూర్తి కావడంతో రష్ చూసుకున్నాం చాలాబాగా వచ్చింది . యాజమాన్య అందించిన పాటలు ప్రేక్షకులను అలరించడం ఖాయం . రజనీకాంత్ దళపతి లా మా సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉందని , మా మొదటి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసాడు .

- Advertisement -