తెలంగాణకు మరో భారీ పెట్టుబడి..

37
- Advertisement -

దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ మంత్రి కేటీఆర్ మరో భారీ పెట్టుబడిని సాధించారు. అలియాక్సిస్ సంస్థకు చెందిన ఆశీర్వాద్ పైప్స్ రూ. 500 కోట్ల పెట్టుబడితో తమ తొలి కర్మాగారాన్ని తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

దావోస్‌లో మంత్రి కేటీఆర్‌తో అలియాక్సిస్ సిఎఫ్ఓ కోయెన్ స్టిక్కర్ సమావేశం అనంతరం సంస్థ తమ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ పెట్టుబడితో రాష్ట్రంలోని 500 మంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి. అలియాక్సిస్ సంస్థ ప్లాస్టిక్ పైల్స్, ఫిట్టింగ్‌లు ఇతర ఉపకరణాలు తయారు చేస్తుంది.

- Advertisement -