ఆంధ్రప్రదేశ్ కు మరో ప్రముఖ అంతర్జాతీయ సంస్థ రానుంది. ఏపీలో సముద్రతీర రంగంలో వ్యాపార వృద్ధికి అవకాశం ఉండటంతో వ్యాపార విస్తరణ వ్యూహంలో భాగంగా పెట్టుబడులు పెట్టేందుకు గజ్‌ప్రొమ్ మొగ్గు చూపింది.
తీర ప్రాంతాల్లో ఓడరేవులు, గ్యాస్ ఆథారిత ప్లాంట్ల విషయంలో ఆసక్తి చూపించింది. కాకినాడలో భారీ ఎల్ఎన్జీ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. 50 లక్షల టన్నుల సామర్ధ్యంతో ఈ ప్లాంట్ ఏర్పాటుకానుంది.
కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ తో కలిసి ప్లాంట్ ఏర్పాటుచేయనుండగా సుమారు రూ.6 వేల కోట్ల వ్యయంతో నిర్మితం కానుంది ఈ టెర్మినల్. ఈ వారంలో ఢిల్లీలో కీలక చర్చలు జరగనుండగా.. కాకినాడ సీ పోర్ట్స్, గజ్‌ప్రొమ్, ఢిల్లీలోని రష్యన్ ఫెడరేషన్ ఎంబసీ ప్రతినిధులు సమావేశం కానున్నారు. రష్యా ప్రభుత్వ వద్యుత్ రంగంలో ప్రముఖ సంస్థగా ఉంది గజ్‌ప్రొమ్. భారత్ లోని ఓడరేవులు, గ్యాస్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలనే వ్యూహంలో భాగంగా గజ్‌ప్రొమ్ ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read:ఆదివాసీల ఆరాధ్య దైవం..కొమురం భీం

